Saturday 10 September 2016

దేవునికంటే గొప్పవాడిననుకుంటున్న మానవుడు-2

                                దేవునికంటే గొప్పవాడిననుకుంటున్న మానవుడు-2

రెండవ రోజు దేవుడు నేలను చేసాడు....(5000 సంవత్సరాలకు )ఆ నేలలో నుండి దేవుడు తన రూపములో జీవముతో వుండే మానవుడిని చేసాడు.మానవుడు దేవుడు చేసిన నేలలో నుండి ఊపిరిలేని బొమ్మను చేసి దేవుడు అన్నాడు. 
  1. మూడవ రోజు రోజు దేవుడు రకరకాల చెట్లను సృష్టించాడు.....మానవుడు దేవుడు చేసిన చెట్లనే దేవుడు అన్నాడు. చెట్లనుంచి వచ్ఛే ఫలాలను మానవుడ్ని అనుభవించమంటే...... తాను చేసిన బొమ్మదగ్గర వాటిని పెడుతున్నాడు. 
  2. నాలుగవ రోజు దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను చేసాడు.వాటి వెలుగు అనుభవించాలని మరియు కాలములు సమయములు దినములు అన్ని మానవుడు తెలుసుకోవాలని.అయితే దేవుని రూపములో చేయబడిన మానవుడు సూర్య చంద్ర నక్షత్రాలను దేవుడు దేవతలు చేసాడు.
  3. అయిదవ రోజు దేవుడు సముద్ర చేపలను ఆకాశములో ఎగురు పక్షులను సృష్టించాడు. అయితే మానవుడు చేపలను పక్షులను దేవుడు దేవతలను చేసాడు.
  4. అయిదవ రోజు దేవుడు అడవి జంతువులను పశువులను చేసాడు ..మానవుడేమో  అడవి జంతువులను పశువులను  దేవుళ్లను చేసాడు.  
    మరి ప్రియులారా దేవుడు చేసిన సృష్టిని దేవునిగా చేసిన మానవుడు దేవునికంటే గొప్పవాడిగా హెచ్చించుకోవటల్లేదా? 
    ప్రియులారా.... ఒక్క దేవుడు, ఇప్పుడు మనం అనుభవిస్తున్న వాటన్నిటిని మనకోసం సృష్టించి మనకిస్తే, మనమేమో మన చేతులతో మనం తయారు చేసిన బొమ్మని దేవుడని గొప్పచేస్తున్నాము. 
    ఒక్కసారి ఆలోచించండి,
    మానవుడు, దేవుడు చేసిన సృష్టిలోనివే మరలా దేవునికి అనిచెప్పి ఇస్తున్నాడు కానీ....... దేవుడు స్వరూపములో, దేవుని పోలికలో, చేయబడిన మానవుడు తనను తాను దేవునికి సమర్పించుకోవాలని తన హృదయాన్ని దేవునికి ఇవ్వాలని ఎప్పుడయినా అనుకున్నాడా..... మరి పూజారి గారు "ఈ పూలు పళ్ళు ఇవన్నీ కాదు మీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి అని ఎప్పుడయినా చెప్పారా..?

    No comments:

    Post a Comment