Saturday 10 September 2016

దేవునికంటే గొప్పవాడిననుకుంటున్న మానవుడు-1

                                 దేవునికంటే గొప్పవాడిననుకుంటున్న మానవుడు-1
నా ప్రియ స్నేహితులారా.....
దేవుడు భూమిని ఆకాశములను సృష్టించాడు. అప్పటికే ఈ భూమిమీద చీకటి వుంది .భూమిని ఆకాశములను సృష్టించిన తర్వాత చాలా సంవత్సరాలకు దేవుడు ఒక క్రమ పద్దతిలో సృష్టిని చేసుకుంటూ వచ్చాడు.


  1. 1.మొదటి రోజు వెలుగును సృష్టించాడు.దేవుడు ఆ వెలుగుకు పగలు అని చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాడు 
  2. 2.రెండవ రోజు ఆకాశాన్ని,ఆరిన నేల (భూమిని)సృష్టించాడు. 
  3. 3.మూడవరోజు గడ్డిని,విత్తనములు ఇచ్చు చెట్లను ,విత్తనములున్న ఫలవృక్షములు సృష్టించాడు. 
  4. 4.నాలుగవ రోజు భూమి మీద వెలుగు ఇయ్యటానికి మరియు కాలములను సమయములను తెలియ    చేయుటకు పగటిని ఏలటానికి పెద్ద జ్యోతి (అంటే సూర్యుడు)ని,రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి (అంటే చంద్రుడు)ని ఆకాశములో సృష్టించాడు. 
  5. 5.అయిదవ రోజు పెద్ద చేపలు చిన్న చేపలు ఆకాశ పక్షులు సృష్టించాడు. 
  6. 6.ఆరవ రోజు అడవి జంతువులను,పశువులను,నేలను ప్రాకు జీవులను మరియు మానవులను సృష్టించాడు.
దేవుడు మొదటి రోజు వెలుగు మొదలుకొని ఆరవ రోజు అడవి జంతువులు,పశువులు,నేలను ప్రాకు జీవులవరకు నోటి మాటతో సృష్టించాడు. అయితే,మానవుడిని సృష్టించుటకు దేవుడు ఇంకొకరితో ఆలోచన చేస్తున్నాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము వారు ఆకాశ పక్షులను సముద్ర చేపలను పశువులను,సమస్త జంతువులను పరిపాలిస్తారు అని సంభాషిస్తున్నాడు.అప్పుడు దేవుడయిన యెహోవా నేలలో నుండి మట్టిని తీసుకుని ఒక నరుని చేసి ఆ నరునిలోనికి తనలోని జీవమును వాయువును నరుని నాసికారంధ్రముల ద్వారా నరునిలోనికి ఊదగా ఆ నరుడు జీవించే ఆత్మ అవుతాడు.ఆ తర్వాత దేవుడయిన యెహోవా ఆ నరునికి గాఢనిద్ర కలుగజేసి ఒక ప్రక్కటెముకను తీసికొని నరునికి సాటి అయిన సహాయముగా స్త్రీని చేసి మరల ఆ గాయమును మాంసముతో పూడ్చివేసి దేవుడు చేసిన స్త్రీని పురుషుని వద్దకు తీసుకు వస్తాడు. ఆ ప్రకారమే దేవుడు తన స్వరూపములో తన పోలిక చొప్పున నరులను(మానవులను) చేసాడు. 
 ఇక్కడ చిత్రమేమిటంటే...... మానవుడు తనను తాను హెచ్చించుకుని దేవుడయ్యాడు. అది ఎలా.... 
                                

No comments:

Post a Comment