Saturday 10 September 2016

దేవునికంటే గొప్పవాడిననుకుంటున్న మానవుడు-3

                               దేవునికంటే గొప్పవాడిననుకుంటున్న మానవుడు-3

మానవుడు ఎంత గొప్పవాడు అయ్యాడో అందరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను......
దేవుని దగ్గర నుండి అన్ని (చూపును,మాటను,నడకను,వినుటను,) పొందుకున్నమానవుడు,దేవుడిని శక్తిలేనివానిగా,మాట్లాడని వానిగా, చెవిటివానిగా,గుడ్డివానిగా,నడవలేనివానిగా,ఏ పని చేయలేనివానిగా మనం తయారు చేసుకుని మనం మాత్రం మన ఇష్టం వఛ్చినట్లు ప్రవర్తిస్తూ దేవుడు అని మనం భావించే మన బొమ్మకు ఒక పువ్వో పత్రమో కొబ్బరి కాయో ఇస్తాము. అబద్ధాలు ఆడి సంపాదిస్తాం .మోసాలు చేసి సంపాదిస్తాం లంచాలు తీసుకుంటాం....హత్యలు చేసి సంపాదిస్తాం దొంగతనాలు చేస్తాం వీటన్నిటిలో మన బొమ్మ దేవునికి భాగము ఇస్తాం 
అందుకే కదా దేశం ఆరు హత్యలు మూడు దోపిడీ దొంగతనాలతో తులతూగుతోంది. బయట (వీళ్లకు లైసెన్స్ లేదు) దొంగలు దోచుకుంటున్నారు. అసెంబ్లీ మరియు పార్లమెంటులో ( వీళ్లకు మనమే లైసెన్స్ ఇచ్చాముVOTE) చల్లటి (AC) గాలిలో కూర్చుని పగలనక రాత్రనక దోచుకుంటుంటారు.
ఏమండి ఒక ప్రశ్న: ఎవరికైనా దేవుడంటే భయం ఉందా? చెప్పండి.....ఎప్పుడైనా మీరు పూజ చేసేటప్పుడు ఆ బొమ్మ దేవుడు నువ్వు చేసిన తప్పును ఖండించాడా?నువ్వు చేసేది తప్పురా అని అది ఎప్పుడైనా చెప్పిందా?
అది మన బొమ్మ దేవుడు అందుకే మాట్లాడదు.దేవుడికంటే మనం గొప్పగా వుండాలని దేవుడిని మనం చేసుకున్నాం.దేవుడు మనల్ని చేసాడు కాబట్టి మనం మాట్లాడుతాము.మనం గొప్పోళ్ళం మనమే మాట్లాడాలి.........మనం చేసిన దేవుడు మాట్లాడడు....
అందుకే.... మానవుడు దేవునికంటే గొప్పవానిగా హెచ్చించుకుంటున్నాడు.
కొనసాగిద్దాం..............

           

దేవునికంటే గొప్పవాడిననుకుంటున్న మానవుడు-2

                                దేవునికంటే గొప్పవాడిననుకుంటున్న మానవుడు-2

రెండవ రోజు దేవుడు నేలను చేసాడు....(5000 సంవత్సరాలకు )ఆ నేలలో నుండి దేవుడు తన రూపములో జీవముతో వుండే మానవుడిని చేసాడు.మానవుడు దేవుడు చేసిన నేలలో నుండి ఊపిరిలేని బొమ్మను చేసి దేవుడు అన్నాడు. 
  1. మూడవ రోజు రోజు దేవుడు రకరకాల చెట్లను సృష్టించాడు.....మానవుడు దేవుడు చేసిన చెట్లనే దేవుడు అన్నాడు. చెట్లనుంచి వచ్ఛే ఫలాలను మానవుడ్ని అనుభవించమంటే...... తాను చేసిన బొమ్మదగ్గర వాటిని పెడుతున్నాడు. 
  2. నాలుగవ రోజు దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను చేసాడు.వాటి వెలుగు అనుభవించాలని మరియు కాలములు సమయములు దినములు అన్ని మానవుడు తెలుసుకోవాలని.అయితే దేవుని రూపములో చేయబడిన మానవుడు సూర్య చంద్ర నక్షత్రాలను దేవుడు దేవతలు చేసాడు.
  3. అయిదవ రోజు దేవుడు సముద్ర చేపలను ఆకాశములో ఎగురు పక్షులను సృష్టించాడు. అయితే మానవుడు చేపలను పక్షులను దేవుడు దేవతలను చేసాడు.
  4. అయిదవ రోజు దేవుడు అడవి జంతువులను పశువులను చేసాడు ..మానవుడేమో  అడవి జంతువులను పశువులను  దేవుళ్లను చేసాడు.  
    మరి ప్రియులారా దేవుడు చేసిన సృష్టిని దేవునిగా చేసిన మానవుడు దేవునికంటే గొప్పవాడిగా హెచ్చించుకోవటల్లేదా? 
    ప్రియులారా.... ఒక్క దేవుడు, ఇప్పుడు మనం అనుభవిస్తున్న వాటన్నిటిని మనకోసం సృష్టించి మనకిస్తే, మనమేమో మన చేతులతో మనం తయారు చేసిన బొమ్మని దేవుడని గొప్పచేస్తున్నాము. 
    ఒక్కసారి ఆలోచించండి,
    మానవుడు, దేవుడు చేసిన సృష్టిలోనివే మరలా దేవునికి అనిచెప్పి ఇస్తున్నాడు కానీ....... దేవుడు స్వరూపములో, దేవుని పోలికలో, చేయబడిన మానవుడు తనను తాను దేవునికి సమర్పించుకోవాలని తన హృదయాన్ని దేవునికి ఇవ్వాలని ఎప్పుడయినా అనుకున్నాడా..... మరి పూజారి గారు "ఈ పూలు పళ్ళు ఇవన్నీ కాదు మీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి అని ఎప్పుడయినా చెప్పారా..?

    దేవునికంటే గొప్పవాడిననుకుంటున్న మానవుడు-1

                                     దేవునికంటే గొప్పవాడిననుకుంటున్న మానవుడు-1
    నా ప్రియ స్నేహితులారా.....
    దేవుడు భూమిని ఆకాశములను సృష్టించాడు. అప్పటికే ఈ భూమిమీద చీకటి వుంది .భూమిని ఆకాశములను సృష్టించిన తర్వాత చాలా సంవత్సరాలకు దేవుడు ఒక క్రమ పద్దతిలో సృష్టిని చేసుకుంటూ వచ్చాడు.


    1. 1.మొదటి రోజు వెలుగును సృష్టించాడు.దేవుడు ఆ వెలుగుకు పగలు అని చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాడు 
    2. 2.రెండవ రోజు ఆకాశాన్ని,ఆరిన నేల (భూమిని)సృష్టించాడు. 
    3. 3.మూడవరోజు గడ్డిని,విత్తనములు ఇచ్చు చెట్లను ,విత్తనములున్న ఫలవృక్షములు సృష్టించాడు. 
    4. 4.నాలుగవ రోజు భూమి మీద వెలుగు ఇయ్యటానికి మరియు కాలములను సమయములను తెలియ    చేయుటకు పగటిని ఏలటానికి పెద్ద జ్యోతి (అంటే సూర్యుడు)ని,రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి (అంటే చంద్రుడు)ని ఆకాశములో సృష్టించాడు. 
    5. 5.అయిదవ రోజు పెద్ద చేపలు చిన్న చేపలు ఆకాశ పక్షులు సృష్టించాడు. 
    6. 6.ఆరవ రోజు అడవి జంతువులను,పశువులను,నేలను ప్రాకు జీవులను మరియు మానవులను సృష్టించాడు.
    దేవుడు మొదటి రోజు వెలుగు మొదలుకొని ఆరవ రోజు అడవి జంతువులు,పశువులు,నేలను ప్రాకు జీవులవరకు నోటి మాటతో సృష్టించాడు. అయితే,మానవుడిని సృష్టించుటకు దేవుడు ఇంకొకరితో ఆలోచన చేస్తున్నాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము వారు ఆకాశ పక్షులను సముద్ర చేపలను పశువులను,సమస్త జంతువులను పరిపాలిస్తారు అని సంభాషిస్తున్నాడు.అప్పుడు దేవుడయిన యెహోవా నేలలో నుండి మట్టిని తీసుకుని ఒక నరుని చేసి ఆ నరునిలోనికి తనలోని జీవమును వాయువును నరుని నాసికారంధ్రముల ద్వారా నరునిలోనికి ఊదగా ఆ నరుడు జీవించే ఆత్మ అవుతాడు.ఆ తర్వాత దేవుడయిన యెహోవా ఆ నరునికి గాఢనిద్ర కలుగజేసి ఒక ప్రక్కటెముకను తీసికొని నరునికి సాటి అయిన సహాయముగా స్త్రీని చేసి మరల ఆ గాయమును మాంసముతో పూడ్చివేసి దేవుడు చేసిన స్త్రీని పురుషుని వద్దకు తీసుకు వస్తాడు. ఆ ప్రకారమే దేవుడు తన స్వరూపములో తన పోలిక చొప్పున నరులను(మానవులను) చేసాడు. 
     ఇక్కడ చిత్రమేమిటంటే...... మానవుడు తనను తాను హెచ్చించుకుని దేవుడయ్యాడు. అది ఎలా....